Published on Oct 30, 2026 9:00 PM IST
తమిళ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నాడు. ఆయన 49వ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ‘మండాడి’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మతిమారన్, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనున్నారని సమాచారం. సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘మండాడి’ విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
మతిమారన్ సూర్యకు ఒక తీరప్రాంత యాక్షన్ డ్రామా కథను వినిపించగా, దానికి సూర్య ఎంతో ఇంప్రెస్ అయ్యారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కలైప్పులి ఎస్. థాను నిర్మించనుండగా, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఈ ఏడాది సూర్య నటించిన ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. ప్రస్తుతం ఆయన జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నజ్రియా నజీమ్, నస్లేన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 6న విడుదల కానుంది.
