Published on Nov 4, 2026 10:30 PM IST
ఒకప్పుడు ఇండియన్ సినిమాని ఏలిన బాలీవుడ్ ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. భారీ గ్రాసర్ లతో సెన్సేషనల్ లాంగ్ రన్ సినిమాలు అందిస్తూ ఇప్పుడు మరో బిగ్ ప్రాజెక్ట్ రిలీజ్ ని తీసుకొస్తుంది. ఇక ఆ సినిమానే ‘రామాయణ’. దర్శకుడు నితీష్ తివారి, రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి లాంటి స్టార్స్ కలయికలో తెరకెక్కిన ఈ ఎపిక్ సినిమా గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది.
అయితే వేల కోట్లు బడ్జెట్ పెట్టిన ఈ సినిమా చాలా లిమిటెడ్ బడ్జెట్ తో తీసిన యాక్షన్ డ్రామా ఓపెనింగ్స్ ముందు వెలవెలబోతున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ధురంధర్ 2 ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్స్ తో కలిపి 200 కోట్లకి పైగా రాబట్టింది. ఇలా కాకపోయినా ప్రీమియర్స్ పక్కన పెట్టి సాధారణ ఓపెనింగ్స్ చూసుకున్నా డే 1 వరకు రామాయణ కంటే ధురంధర్ 2 నే లీడ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది.
సో ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ధురంధర్ 2 ని అందుకోవడం కష్టమే అని అనుకోవచ్చు. ఇక ఈ సినిమాలో సన్నీ డియోల్, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటించగా ఏ ఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ లు సంగీతం అందించారు. అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణం వహించారు.
