Published on Nov 10, 2026 10:00 PM IST
ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రానున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాల్లో ఒకటే ‘జనవరి 12 విడుదల’. విక్టరీ వెంకటేష్ అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ లు హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ ఇది కాగా వచ్చే ఏడాది సంక్రాంతి మార్కెట్ టార్గెట్ గా రాబోతుంది. అయితే ఈ సినిమా షూట్ కూడా దాదాపు పూర్తి చేసుకువస్తుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం క్లైమాక్స్ యాక్షన్ అలాగే కేవలం ఒక్క పాట మాత్రమే సినిమాలో బ్యాలన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ సినిమాలో సాలిడ్ ఎంటెర్టన్మెంట్ మాత్రమే కాకుండా జీవి ప్రకాష్ మ్యూజిక్ కూడా హైలైట్ గా నిలుస్తుంది అని అనీల్ రివీల్ చేసారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్ గా కీర్తి సురేష్, కృతి శెట్టి లు నటిస్తుండగా జీ సంస్థ మరియు షైన్ స్క్రీన్ వారు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.
