Published on Nov 10, 2026 9:00 PM IST
తమిళ స్టార్ హీరో సూర్యకి మన తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. తమిళ్ తర్వాత తను తెలుగు మార్కెట్ పైనే ఎక్కువ ఫోకస్ చేసి దాదాపు తన సినిమాలు అన్నీ విడుదల చేసారు. అయితే సూర్య ఇచ్చిన మాస్ కంబ్యాక్ ని మాత్రం ఈ మధ్య కాలంలో ఎవరూ ఇవ్వలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కంగువా, రెట్రో లాంటి భారీ డిజాస్టర్స్ తర్వాత సింగిల్ ఏడాదిలో సూర్య మూడు వరుస హిట్స్ కొట్టి మాసివ్ కంబ్యాక్ ఇచ్చారు.
అయితే ఇదో రేర్ ఫీట్ అయితే దీనికి మించి మరో రేర్ ఫీట్ ఏమిటంటే తమిళ్, తెలుగు అలాగే మలయాళం మూడు ఇండస్ట్రీలకి చెందిన దర్శకులతో సినిమాలు చేసి ఒకదాన్ని మించి ఒక హిట్ కొట్టడం మాత్రం బహుశా ఒక్క ఏడాదిలో సూర్యకి మాత్రమే చెల్లింది అని చెప్పవచ్చు. ఒకే ఏడాదిలో మూడు హిట్లు పైగా మూడు ఇండస్ట్రీ లకి చెందిన వారితో కొట్టడం అనేది గ్రేట్.. ఇక నెక్స్ట్ సూర్య సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.
