Published on Nov 11, 2026 10:01 PM IST
బాలీవుడ్ ఎపిక్ చిత్రం ‘రామాయణ’ ప్రపంచవ్యాప్తంగా రికార్డులను తిరగరాస్తూ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. నితీష్ తివారీ డైరెక్షన్లో నమిత్ మల్హోత్రా ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్, యష్, సాయి పల్లవి తమ పర్ఫార్మెన్స్లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు యావత్ ప్రేక్షకులు పట్టం కడుతూ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు.
కేవలం ఇండియాలోనే కాకుండా ఈ చిత్రం ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర కూడా సాలిడ్ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి. తొలి మంగళవారం నాడు కూడా ఈ చిత్రం ఏకంగా 2 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమా నార్త్ అమెరికా వసూళ్లు ఇప్పటికే 15.5 మిలియన్ డాలర్ల గ్రాస్ మార్క్ దాటి ఈ చిత్ర పవర్ ఏమిటో చూపెడుతుంది. రాబోయే రోజుల్లోనూ ఈ చిత్రం ఇదే స్థాయి కలెక్షన్స్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
