Published on Nov 15, 2026 10:02 PM IST
ఈ నవంబర్ లో రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో టాలెంటెడ్ నటీనటులు దుల్కర్ సల్మాన్ అలాగే సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కించిన అవైటెడ్ ఎమోషనల్ రైడ్ చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ కూడా ఒకటి. ఇక ఈ సినిమా తాలూకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నేడు చేశారు.
అయితే ఈ ఈవెంట్ కి సినిమాకి సపోర్ట్ చేసేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా వచ్చాడు. అయితే ఈ సినిమా విషయంలో బన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. సాధారణంగా తన తండ్రి అల్లు అరవింద్ ఒక సినిమా రషెస్ చూసి వచ్చి మాట్లాడ్డం అనేది చాలా అరుదు.
ఒకవేళ మాట్లాడినా ఎప్పుడో కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అలా కాదు తన మనసుకి ఎంతో నచ్చిన సినిమా ఇది అని సినిమా ఎంతో బాగుంటుంది అని చాలాసార్లు చెప్పారని అంతెందుకు ఎప్పుడూ తన సినిమా కోసం కూడా నాన్న గారు మాట్లాడలేదు కానీ అలాంటిది ఆకాశంలో ఒక తార కోసం చాలా సార్లు మాట్లాడారని అక్కడే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది అర్ధం అయింది అన్నట్టు బన్నీ తెలిపాడు. ఇలా సినిమాని బన్నీ ఆకాశానికి ఎత్తేసాడు. దీనితో తన కామెంట్స్ వైరల్ గా మారాయి.
