Published on Nov 21, 2026 11:05 PM IST
డిసెంబర్ 4న విడుదల కావాల్సిన ‘వృషకర్మ’ చిత్రంపై వాయిదా ఊహాగానాలు ఫిలిం నగర్లో వేడెక్కుతున్నాయి. ఒకవైపు చైతు, మీనాక్షి చౌదరిలతో ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేస్తూ ప్రచారం జోరుగా సాగిస్తుండగానే, హఠాత్తుగా వాయిదా చర్చలు తెరపైకి రావడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడం, సెన్సార్ కాపీ సిద్ధం చేసేందుకు దర్శకుడు కార్తీక్ దండు బృందం శ్రమిస్తున్నప్పటికీ అనుకున్న సమయానికి పూర్తవుతుందా లేదా అన్న సందేహాల నేపథ్యంలో వాయిదా అంశంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
అధికారిక ప్రకటన రాకపోయినా, విడుదల సమీపిస్తున్న వేళ ఈ వార్తలు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఒకవేళ ఈ చిత్రం వాయిదా పడితే డిసెంబర్ 4న లభించే సోలో విండోను కోల్పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ తేదీన వేరే జానర్లోని నితిన్ అలియాస్ రుక్మిణి ఉన్నప్పటికీ, పాజిటివ్ టాక్ వస్తే ‘వృషకర్మ’కు భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.
