Published on Nov 22, 2026 11:00 PM IST
టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ జంట విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందన్నాల కలయికలో వచ్చిన సినిమా ‘రణబాలి’ ఆడియెన్స్ మనసు గెలుచుకుంది. అయితే ఈ సినిమా కాకుండా సోలోగా ఇద్దరి నుంచి ఈ ఏడాదిలోనే సాలిడ్ సినిమాలు రావాల్సి ఉంది.
ఆ చిత్రాలే విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ‘రౌడీ జనార్ధన’ అలాగే రష్మిక లీడ్ పాత్రలో దర్శకుడు రవీంద్ర పుల్లే తెరకెక్కించిన సినిమా ‘మైసా’. దీని నుంచి లేటెస్ట్ గానే ఓ సాంగ్ కూడా వదిలారు. కానీ ఊహించని విధంగా సినిమాని వాయిదా వేస్తున్నట్టు అనౌన్స్ చేయడం ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసింది.
అలాగే ఈ ఏడాదిలోనే రిలీజ్ కి ప్రామిస్ చేసిన రౌడీ జనార్ధన విడుదలకి కూడా సరైన స్లాట్ కనిపించడం లేదు. సో ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తల సినిమాలు విడుదల సందిగ్ధంలో పడ్డాయి. అయితే విజయ్ సినిమా ఈ ఏడాదిలో ఒకింత అనుమానమే అనుకోవాలి. రష్మిక సినిమా ఆల్రెడీ అప్డేట్స్ స్టార్ట్ అయ్యాయి. సో మైసా వచ్చినా రౌడీ జనార్ధన కష్టమే అనుకోవాలి.
