Published on Nov 24, 2026 10:24 PM IST

నిర్మాణ సంస్థ శాంతి టాకీస్ (Shanthi Talkies) తమ తదుపరి సినిమాను అధికారికంగా ప్రకటించింది. నటి శ్రుతి హాసన్ ప్రధాన పాత్రలో రూపొందనున్న ఈ చిత్రానికి తరుణ్ తేజ రచన, దర్శకత్వం వహించనున్నారు. అరుణ్ విశ్వ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
గతంలో శివకార్తికేయన్ హీరోగా ‘మావీరన్’, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో ‘3BHK’ వంటి చిత్రాలను అందించిన శాంతి టాకీస్.. ఇప్పుడు శ్రుతి హాసన్ కాంబినేషన్లో మరో కొత్త కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమైంది.
‘అశ్విన్స్’ దర్శకుడితో కొత్త సినిమా
వసంత్ రవి హీరోగా వచ్చిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘అశ్విన్స్’తో దర్శకుడు తరుణ్ తేజ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాలో ఆయన కథనం, విజువల్స్, సౌండ్ డిజైన్‌కు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు శ్రుతి హాసన్‌తో కలిసి మరో కొత్త జానర్లో ఈ తమిళ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వివిధ పాత్రలతో మెప్పిస్తున్న శ్రుతి హాసన్ ఈ ప్రాజెక్ట్‌లో లీడ్ రోల్ పోషించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, షూటింగ్ షెడ్యూల్ వివరాలను చిత్ర బృందం త్వరలోనే వెల్లడించనుంది.
