Published on Nov 27, 2026 10:01 PM IST
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’. ఈ సినిమా తర్వాత సందీప్ ఏ హీరోతో సినిమా చేస్తాడనే దానిపై గత కొంతకాలంగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మహేష్ బాబు లేదా అల్లు అర్జున్తో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని రకరకాల ఊహాగానాలు వినిపించాయి.
అయితే, తాజాగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా తన నెక్స్ట్ చిత్రంపై స్పష్టతనిచ్చాడు. బ్లాక్బస్టర్ మూవీ ‘యానిమల్’కు సీక్వెల్గా రానున్న ‘యానిమల్ పార్క్’ గురించి మాట్లాడుతూ.. ‘స్పిరిట్’ పూర్తయిన వెంటనే తాను ‘యానిమల్ పార్క్’ పనులను ప్రారంభిస్తానని తేల్చి చెప్పాడు. దీంతో మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలపై వస్తున్న వార్తలకు ఫుల్స్టాప్ పడింది.
ఇక ప్రస్తుతం సందీప్ పూర్తిగా ‘స్పిరిట్’ షూటింగ్పైనే దృష్టి పెట్టాడు. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. త్రిప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య దేశాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
