1. పి.వి. నరసింహరావు ప్రధానమంత్రిగా పని చేసిన కాలం?
1. 1991-1996
2. 1992-1996
3. 1990-1996
4. 1989-1994
2. మధ్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1. గ్వాలియర్
2. జబల్పూర్
3. భోపాల్
4. ఇండోర్
3. ఈ క్రింది నాలుగు లోక్ సభల్లో మూడింటికి ఒక్కొక్క దానికి ఇద్దరు స్పీకర్లు పని చేశారు. భిన్నమైనదేదో కనుక్కోండి?
1. 4వ లోక్ సభ
2. 5వ లోక్ సభ
3. 6వ లోక్ సభ
4. 7వ లోక్ సభ
4. భారత అటార్నీ జనరల్ కు సంబంధించిన ఈ క్రింది వాక్యాలలో వాస్తవ దూరమైనదేది?
1. ఆయన భారత ప్రభుత్వ పూర్తి స్థాయి కౌన్సిల్
2. ఆయన ఒక పార్లమెంట్ సభ్యునికి ఉండే విశేష హక్కులు కలిగి ఉంటాడు.
3. పార్లమెంటులోని రెండు సభల్లో మాట్లాడే హక్కు కలిగి ఉంటాడు.
4. అతను ప్రభుత్వ ఉద్యోగి కాదు.
5. చండీఘర్ లోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ శాఖ యొక్క న్యాయాధికార పరిధి విస్తరించి ఉన్న ప్రాంతాలు?
1. పంజాబ్ మరియు హర్యానా
2. పంజాబ్, హర్యానా మరియు చండీఘర్ 3. పంజాబ్, హర్యానా, చండీఘర్ మరియు హిమా చల్ ప్రదేశ్
4. పంజాబ్, హర్యానా, చండీఘర్,
హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ- కాశ్మీర్
6. ఈ క్రింది వరుసలో పార్లమెంటరీ కమిటీలు వాటి అధ్యక్షులు ఉన్నారు. ఇందులో తప్పుగా జతపర్చబడి నది ఏది?
1. మానవ వనరుల కమిటీ- మురళీ మనోహర్ జోషి
2. గృహ వ్యవహారాల కమిటీ – సుష్మస్వరాజ్
3. రక్షణ వ్యవహారాల కమిటీ – బాలా సాహెబ్ వికి పాటిల్
4. పట్టణాభివృద్ధి కమిటీ – మహమ్మద్ సలీం
7. మహిళలను సంరక్షించుటకు గృహహింస చట్టం 2006 అమలునకు వచ్చిన తేది?
1. ఏప్రిల్ 25, 2006
2. అక్టోబర్ 26, 2006
3. మార్చి 10, 2006
4.జులై 12, 2006
8. ప్రాంతీయ మండలులను సమకూర్చుటకు వీలు కల్పించబడినది దేని క్రింద?
1. మూల రాజ్యాంగము
2. రాష్ట్రాల పునర్విభజన చట్టము 1956
3. 42వ రాజ్యాంగ సవరణ
4. 44వ రాజ్యాంగ సవరణ
9. రాజ్యాంగము యొక్క ‘ఆధారభూత సంరచన సిద్ధాంతమును సుప్రీంకోర్టు ప్రతిపాదించినది?
1. మినర్వా మిల్స్ కేసు నందు
2. గోలకనాథ్ కేసు నందు
3. కేశవానంద భారతి కేసు నందు
4. గోపాలన్ మరియు మద్రాసు రాష్ట్రముల మధ్య కేసునందు
10. రాజ్యాంగములోని ఏ భాగాన్నయినా లోకసభ సవరించుటకు గల హక్కు ఏ సవరణ ద్వారా దృడపరచబ డినది?
1. 24వ సవరణ
2. 39వ సవరణ
3. 42వ సవరణ
4. 44వ సవరణ
11. యు.పి.యస్.సి. తన కార్యకలాపమును గూర్చి వార్షిక నివేదికను సమర్పించునది ఎవరికి?
1. పార్లమెంటు
2. కేంద్ర గృహ మంత్రి
3. భారత ప్రధాన న్యాయమూర్తి
4. రాషపతి
12. ప్రధాన ఎన్నికల అధికారి పదవీ కాలము?
1. రాష్ట్రపతి సంతృప్తిగా ఉన్నంత కాలము
2. పార్లమెంట్ సంతృప్తిగా ఉన్నంత కాలము
3. నిర్ణీతమైన ఐదు సంవత్సరములు
4. నిర్ణీతమైన ఆరు సంవత్సరములు
13. షెడ్యూల్ కులములు మరియు షెడ్యూల్డ్ తరగతులకు పార్లమెంటు మరియు రాష్ట్ర శాసన సభలందు రిజర్వేషను 2010 వరకు పొడిగించబడినది?
1. 61వ సవరణ
2. 79వ సవరణ
3. 62వ సవరణ
4. 64వ సవరణ
14. భారత్ యొక్క అగంతుక నిధి నుండి అకస్మిక వ్యయ నిమిత్తము ఎవరిచే ద్రవ్యమును అడ్వాన్సుగా తీసుకొ నవచ్చును?
1. రాష్ట్రపతి
2. కేంద్ర ఆర్థిక మంత్రి
3. ప్రధాన మంత్రి
4. కంప్రోలర్ అండ్ అడిటర్ జనరల్
15. ‘ఫోర్త్ ఎస్టేట్’ అను పదమును సూచించునది?
1. పార్లమెంట్
2. జుడిషియరీ
4. ప్రెస్
4. అమెండ్మెంట్స్
16. ఈ క్రింది వానిలో రాజ్యాంగములో పొందుపరచనిది ఏది?
1. ఎలక్షన్ కమీషన్
2. ప్లానింగ్ కమీషన్
3. ఫైనాన్స్ కమీషన్
4. పబ్లిక్ సర్వీస్ కమీషన్
17. ఈ క్రింది వారిలో ఉపరాష్ట్రపతి కాకుండా భారత రాష్ట్రపతి అయినది?
1. జాకీర్ హుస్సేన్
2. వి.వి.గిరి
3. ఎన్. సంజీవరెడ్డి
4. ఆర్. వెంకట్రామన్
18. ఈ క్రింది వానిలో, ఏ రాష్ట్రము అడ్మినిస్ట్రేటివ్ న్యాయ స్థానాలను రద్దు పరచిన నిర్ణయమును సుప్రీకోర్టు సమర్థించినది?
1. మధ్య ప్రదేశ్
2. హిమాచల్ ప్రదేశ్
3. ఉత్తర ప్రదేశ్
4. తమిళనాడు
19. రాష్ట్ర గవర్నరు ఆర్డినెన్సులను జారీ చేయవచ్చును కానీ, ఇవి ఎవరి ఆమోదమునకు లోబడి ఉండును?
1. భారత రాష్ట్రపతి
2. రాష్ట్ర శాసనసభ
3. పార్లమెంట్
4. రాష్ట్రమంత్రి మండలి
20. ఆంధ్రప్రదేశ్ నందలి ప్రజాపరిషత్తుల సంఖ్య?
1. 1104
2. 1140
3. 1100
4. 1150
21. ‘ఆరు విషయాల సూత్రము’ (సిక్స్-పాయింట్ ఫార్ములా) రాజ్యాంగములో పొందుపరచబడినది దేని ద్వా రా ?
1. 33వ సవరణ, 1974
2. 39వ సవరణ, 1975
3. 42వ సవరణ, 1976
4. 32వ సవరణ, 1973
22. భారతదేశంలో రాజకీయ అధికారమునకు ప్రధానమైన ఆధారము?
1. రాజ్యాంగము
2. ప్రజలు
3. పార్లమెంట్
4. పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసన సభ్యులు
23. భారతదేశము స్వాతంత్ర్యమును పొందినపుడు ఎన్ని రకములైన రాజకీయ విభాగములుండినవి?
1. ఒకటి
2. నాలుగు
3. రెండు
4. మూడు
24. పభుత్వము, అంటరానితనమును రాజ్యాంగము లోని ఏ నిబంధన కింద నిర్మూలించినది?
1. ఆర్టికల్ 16
2. ఆర్టికల్ 17
3. ఆర్టికల్ 18
4. ఆర్టికల్ 20
25. ప్రాథమిక హక్కులను అమలు పరచుటకు న్యాయ స్థానము జారీ చేయునది?
1. రిట్
2. డిక్రీ
3. ఆర్డినెన్స్
4. నోటిఫికేషన్
26. ప్రభుత్వ విధానమైన ఆదేశిక సూత్రాల ప్రయ త్నము?
1. రాజ్యాంగము యొక్క సర్వోన్నతిని నిరూపించుట
2. అధికారబల ప్రేరిత (Authoritarian) పరిపాల నను ప్రతిబంధిచుట
3. న్యాయ వ్యవస్థను బలపరచుట
4. సాంఘీక మార్పునకు రాజ్యాంగమును ఒక సాధనముగ చేయుట
27. రాష్ట్రపతి పదవి ఎన్నికకు గరిష్ట వయస్సు?
1. 65 సంవత్సరాలు
2. ఏమీలేదు
3. 70 సంవత్సరాలు
4. 75 సంవత్సరాలు
28. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన వివాదములను తీర్మానించునది?
1. సుప్రీంకోర్టు
2. ఎలక్షన్ కమీషన్
3. పార్లమెంట్
4. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు
29. రాజ్యాంగములో ఎన్ని విధములైన అత్యవసర పరిస్థి తులను కల్పించబడినవి?
1. ఒకటి 2. రెండు
3. మూడు
4. నాలుగు
30. పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశమునకు అధ్యక్షత వహించునది?
1. రాష్ట్రపతి
2. ఉపరాష్ట్రపతి
3. స్పీకరు మరియు ఉపరాష్ట్రపతి ఆవర్తనం ప్రకా రము
4. స్పీకరు
31. పార్లమెంట్ నందలి రెండు సభలలో ఏ ఒకదానికైనా నిర్వహించుటకు అవసరమైన కోరమ్ లేక కనీస సభ్యుల సంఖ్య?
1. మూడింట ఒక వంతు
2. పదింట ఒక వంతు
3. నాలుగింట ఒక వంతు
4. ఐదింట ఒక వంతు
32. పార్లమెంట్ ఉభయ సభలు ఒకటిగా సమావేశమై ఏదైన బిల్లును పరిశీలించినప్పుడు తీర్మానములు చేయునది?
1. సాధారణ మెజారిటీ
2. మూడింట రెండు వంతుల మెజారిటీ
3. ప్రతీ సభ యొక్క మెజారిటీ విడివిడిగా
4. మొత్తం సభ్యుల సంపూర్ణ మెజారిటీ
33. ప్రజాహిత వ్యాజ్యాల భావన ఆవిర్భవించినది?
1. ఇంగ్లాండ్ నందు
2. యు.ఎస్.ఎ నందు
3. ఆస్ట్రేలియా నందు
4. కెనడా నందు
34. ఈ క్రింది వానిలో, ఏ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాం తాలు ఒకే హై కోర్టును కలిగి ఉన్నాయి?
1. అస్సాం మరియు బెంగాల్
2. ఉత్తర ప్రదేశ్ మరియు బిహార్
3. పంజాబ్, హర్యానా మరియు చంఢీఘర్
4. పంజాబ్ మరియు జమ్మూ -కాశ్మీర్
35. భారత రాజ్యాంగము, భారతదేశమును వర్ణించునది?
1. ఒక సమాఖ్య గా
2. ఒక రాష్ట్రాల సమాఖ్యగా
3. ఒక సంధిబద్దమైన సంఘటనగా
4. ఒక సమాఖ్య ప్రాయముగా
36. ఈ క్రింది వానిలో ఎవరి సమ్మతితో కేంద్ర ప్రభుత్వము ఏదైనా కార్యమును రాష్ట్రమునకు అప్పగించువ చ్చును?
1. పార్లమెంట్
2. రాష్ట్రపతి
3. భారత ప్రధాన న్యాయమూర్తి
4. రాష్ట్ర ప్రభుత్వము
37. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఏర్పాటైన సంవత్సరము?
1. ఏప్రిల్ 16, 2007
2. ఫిబ్రవరి 16, 2007
3. జనవరి 26, 2008
4. నవంబర్ 1, 1956
** DailyEducation.in – 12 DailyEducation.in
** DailyEducation.in – 11 DailyEducation.in
** DailyEducation.in – 10 DailyEducation.in
** DailyEducation.in – 9 DailyEducation.in
** DailyEducation.in – 8 DailyEducation.in
** DailyEducation.in – 7 DailyEducation.in
** DailyEducation.in – 6 DailyEducation.in
** DailyEducation.in – 5 DailyEducation.in
** DailyEducation.in – 4 DailyEducation.in
** DailyEducation.in – 3 DailyEducation.in