గృహలక్ష్మి టీవీ సీరియల్ తో ఫేమస్, జాబ్ వదిలేసి బుల్లితెరపైకి.. నిఖిల్ నాయర్ ఎవరో తెలుసా ?

Educator

New member
<p>Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో&nbsp;వైల్డ్ కార్డు&nbsp;ఎంట్రీ ఇచ్చిన మరో కంటెస్టెంట్ నిఖిల్&nbsp;నాయర్. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు&nbsp;సుపరిచయమైన&nbsp;నిఖిల్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.&nbsp;</p><img><p>బుల్లితెర ప్రేక్షకులని&nbsp;ఉర్రూతలూగించిన టీవీ సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి ఒకటి. ఈ టీవీ సీరియల్ తో ఫేమస్ అయిన ఓ నటుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి&nbsp;వైల్డ్ కార్డు&nbsp;ఎంట్రీ ఇచ్చారు. ఆ నటుడి పేరు నిఖిల్ నాయర్. గృహలక్ష్మి సీరియల్ లో ప్రేమ్ పాత్రలో నిఖిల్ నాయర్ ప్రతి ఒక్కరినీ అలరించారు. నిఖిల్ నాయర్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో అతడి&nbsp;గురించి కొన్ని ఆసక్తికర వైరల్ అవుతున్నాయి.&nbsp;</p><img><p>నిఖిల్ ఫ్యామిలీ కేరళకి చెందినవారు. బెంగళూరులో స్థిరపడ్డారు. నిఖిల్ నాయర్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అలాగే ఎంబీఏ డిగ్రీ కూడా పొందారు. బెంగళూరులో నిఖిల్ కొంతకాలం భారీ శాలరీతో&nbsp;ఉద్యోగం చేశారు. కనై ఉద్యోగం చేయడం అతడి&nbsp;లక్ష్యం, ఆసక్తి కాదు. ఏదైనా కొత్తగా సాధించాలి అనే తపన ఉంది. 9 నుంచి 5 వరకు ఉద్యోగం చేయడం అతడికి&nbsp;చిరాకుగా&nbsp;మారింది. దీనితో&nbsp;నటనలో అవకాశాల కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో యాడ్స్ కి కూడా ఆడిషన్స్ ఇచ్చాడు.&nbsp;</p><img><p>అయితే నటనలో పూర్తి స్థాయిలో మెళుకువలు&nbsp;నేర్చుకునేందుకు యాక్టింగ్ క్లాసులకు అంటెండ్&nbsp;అయ్యేవాడు. ఈ క్రమంలో నటనని, ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టంగా మారింది. దీనితో&nbsp;జాబ్ మానేసి పూర్తిగా నటనపై ఫోకస్ పెట్టాడు. ఆ తర్వాత మలయాళీ&nbsp;టీవీ సీరియల్స్ లో నిఖిల్ కి అవకాశాలు మొదలయ్యాయి.&nbsp; ఇంటింటి గృహలక్ష్మి టీవీ సీరియల్ తో నిఖిల్ తెలుగులో కూడా ఫేమస్ అయ్యారు. అలా సాగిన నిఖిల్ కెరీర్ ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 వరకు చేరుకుంది. నిఖిల్ మలయాళీ&nbsp;కుర్రాడు అయినప్పటికీ తెలుగు చక్కగా మాట్లాడతారు.&nbsp;</p>
 
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock