అరకు కాఫీ ద్వారా జాతీయ స్థాయిలో బిజినెస్ లైన్ ఛేంజ్ మేకర్ అవార్డు దక్కించుకున్న గిరిజన సహకార సంస్థ (జీసీసీ)ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అభినందించారు. అరకు వ్యాలీకి కాఫీకి ఫైనాన్షియల్ ట్రాన్సఫర్మేషన్ విభాగంలో అవార్డు దక్కడంపై గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Gummidi Sandhyarani) , జీసీసీ ఎండీ కల్పన కుమారి (Kalpana Kumari) ని ప్రశంసించారు. సచివాలయం లో ప్రశంసా పత్రాన్ని, అవార్డ్‌ను ముఖ్యమంత్రికి అందజేశారు. జీఐ ట్యాగ్ పొందిన తర్వాత అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ బ్రాండ్‌గా మారిందని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాఫీ సాగు ద్వారా అరకులోని గిరిజనుల జీవన శైలిలో మార్పు వచ్చిందన్నారు. ఇటీవల జీసీసీ `టాటా కన్స్యూమర్ ప్రొడెక్ట్ లిమిటెడ్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంతో దేశంలో తొలిసారిగా ఆర్గానిక్ సాల్యూబుల్ కాఫీ ఉత్పత్తి కానుందని మంత్రి సంధ్యారాణి చంద్రబాబుకు వివరించారు.
The post GCC: జీసీసీకి సీఎం చంద్రబాబు అభినందనలు appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు | NRI Telugu News Paper in USA - Telugu Times.
The post GCC: జీసీసీకి సీఎం చంద్రబాబు అభినందనలు appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు | NRI Telugu News Paper in USA - Telugu Times.