నాలుగేళ్లు కష్టం తరువాత ‘అరి’ మూవీని అక్టోబర్ 10న ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతోన్నారు. అయితే జయ శంకర్ చేసిన ఈ ప్రయాణంలో తనకు బ్యాక్ బోన్‌గా నిలిచిన, ప్రాణానికి ప్రాణమైన తండ్రి(వంగ కనకయ్య)ని, బావ(కె.వి. రావు)ని కోల్పోయాడట. అందుకే ఈ అరి మూవీని వారిద్దరికీ అంకితం చేస్తున్నాను అంటూ జయశంకర్ తాజాగా వేసిన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది. జయశంకర్ వేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ అందరి మనసుల్ని తాకేలా ఉంది.
‘రేపటి నుంచి అరి ఇక ఆడియెన్స్ సొంతం.. నాకు ఈ మూవీ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది.. ఈ ప్రయాణంలో నా జీవితంలోని మూల స్తంభాలైన మా తండ్రి గారు, బావ గారు మరణించారు. నేను వారిద్దరినీ కోల్పోయాను.. అరి చిత్రంలోని ప్రతీ ఫ్రేమ్‌పై వారి ఆశీస్సులు ఉంటాయి.. ఈ మూవీని నేను ఆ ఇద్దరికీ అంకితం చేస్తున్నాను’ అని పోస్ట్ వేశారు.
The post Jaya Shankar: అరి నాకెంతో ప్రత్యేకం.. ఆ ఇద్దరినీ కోల్పోయా.. డైరెక్టర్ జయశంకర్ పోస్ట్ appeared first on Telugu Rajyam.