Parenting Tips: పిల్లలు చదవడానికి, హోం వర్క్ రాయడానికి మారాం చేస్తున్నారా? పేరెంట్స్ చేయాల్సింది ఇదే..!

Educator

New member

స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చదవడానికి, రాయడానికి ఇష్టపడటం లేదా? మరి, పిల్లల ప్రవర్తనను ఎలా మార్చాలి? చదువు మీద ఆసక్తి పెంచాలంటే పేరెంట్స్ ఏం చేయాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...

సమ్మర్ హాలీడేస్ అయిపోయాయి.. స్కూళ్లు రీ ఓపెన్ అయ్యాయి. పిల్లలు కూడా స్కూల్లకు వెళ్లిపోతున్నారు. హమ్మయ్య.. స్కూల్ కి వెళ్లారు..కాసేపు ప్రశాంతంగా ఉండొచ్చు అనుకునేలోగా.. సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తారు. ఎంత స్కూల్ కి పంపినా.. ఇంట్లో చదవాల్సినవి, రాయాల్సినవి కూడా చాలా ఉంటాయి. హోం వర్క్స్ అని, క్లాస్ టెస్ట్ లు ఇలా చాలానే ఉంటాయి. కానీ.. పిల్లలు ఇంటికి రావడం ఆ పుస్తకాల సంచిని పక్కన పడేసి.. టీవీల ముందు వాలిపోతూ ఉంటారు. లేదంటే.. ఏదో ఒక ఆటలు ఆడుతూ ఉంటారు. హోం వర్క్ రాయమన్నా, ఏదైనా బుక్ తీసి చదవమన్నా.. కాస్త కూడా ఇంట్రస్ట్ చూపించరు. కానీ.. ఇలా పిల్లలు చదవకపోతే పేరెంట్స్ కి టెన్షన్ వచ్చేస్తుంది. ఇలా అయితే మార్కులు ఎలా వస్తాయి? అంటూ పిల్లలను తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తున్నారా? స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చదవడానికి, రాయడానికి ఇష్టపడటం లేదా? మరి, పిల్లల ప్రవర్తనను ఎలా మార్చాలి? చదువు మీద ఆసక్తి పెంచాలంటే పేరెంట్స్ ఏం చేయాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...

మనం ఏదైనా పనిని కంటిన్యూస్ గా చేయాల్సి వస్తే, ఎవరికైనా విసుగు వచ్చేస్తుంది. ఎంత నచ్చిన పని అయినా.. రోజూ చేయాలంటే ఒకింత చిరాకు వచ్చేస్తుంది. ఉదాహరణకు మీకు పూరీ ఇష్టం అనుకోండి.. రోజూ అదే తినమంటే తినగలరా? నాలుగు రోజులు తినే సరికి విరక్తి వస్తుంది. పిల్లలకు చదువు విషయంలో కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లో చదువుతూనే ఉన్నాం కదా.. మళ్లీ ఇంటికి వచ్చి చదవాలా అనే భావన కలుగుతుంది. దాని వల్లే హోం వర్క్ లకు కూడా ఆసక్తి చూపించరు. అయితే.. పిల్లలకు చదువు పట్ల ఆసక్తి పెంచితే ఈ సమస్య ఉండదు. దాని కోసం పేరెంట్స్ కొంచెం శ్రమ పెట్టాల్సి ఉంటుంది.

మీ పిల్లలు చదువుకోవడానికి కూర్చున్నప్పుడు వారిని ప్రోత్సహించడానికి కొన్ని బహుమతులు ఇవ్వడం అలవాటు చేసుకోండి. ఈ బహుమతులు ఖరీదైనవి లేదా పెద్దవిగా ఉండవలసిన అవసరం లేదు. అవి మీ బిడ్డకు ఇష్టమైన స్వీట్లు లేదా వారు ఇష్టపడే ఏదైనా చిన్న వస్తువు కావచ్చు. ఉదాహరణకు, మీరు వారికి చాక్లెట్, రంగు పెన్సిళ్లు, కొత్త రకం పెన్ను మొదలైనవి ఇవ్వవచ్చు. వారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా చదువుకుంటే వారికి ఇష్టమైన ప్రదేశాలకు తీసుకెళ్లామని ప్రామిస్ చేయండి. వారు ప్రతిరోజూ చదవడం ప్రారంభించిన తర్వాత, ఒక రోజు వారికి ఇష్టమైన ప్రదేశానికి తీసుకెళ్లండి. ఇలా చేయడం వల్ల వారు కూడా చదవడానికి ఆసక్తి చూపిస్తారు.

పిల్లలకు కఠినమైన పాఠాలను బట్టీ పట్టి మరీ చదివించకూడదు. వారు అర్థం చేసుకునేలా చెప్పాలి. కొన్ని పాఠాలను కథల రూపంలో చెబితే పిల్లలకు చాలా బాగా అర్థమౌతుంది. అలా కాకుండా.. బట్టి పట్టీ చదివించి.. రావడం లేదని కొట్టకూడదు. ప్రేమతో నేర్పించడానికి ప్రయత్నించాలి. పుస్తకాల ద్వారా మాత్రమే వారికి నేర్పించే బదులు, మీరు మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ఉపయోగించి ఎప్పటికప్పుడు సబ్జెక్టుకు సంబంధించిన వీడియోల ద్వారా కూడా వారికి నేర్పించవచ్చు. ఇది వారికి చదువుపై ఆసక్తిని కలిగిస్తుంది. ముఖ్యంగా మ్యాథ్స్, సైన్స్ లాంటివివి ఉదాహరణలతో వివరించడానికి ప్రయత్నించండి. చారిత్రక విషయాలను బోధించేటప్పుడు, వారికి నిజమైన సంఘటలను వివరించాలి. ఇలా చేయడం వల్ల ఆసక్తి పెరుగుతుంది.

ఇంట్లో పేరెంట్స్ కూడా కఠినంగా టీచర్స్ లా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. మీరు ఒక ప్రశ్న అడిగినప్పుడు పిల్లలు తప్పు సమాధానం ఇస్తే, మీరు వారిని సరిదిద్దడానికి ప్రయత్నించాలి. దానికి వారిని శిక్షించాల్సిన అవసరం లేదు. వారు సరైన సమాధానం ఇచ్చిన ప్రతిసారీ వారిని ప్రోత్సహించండి. మీరు వారికి ప్రశంసలతో పాటు కొన్ని చిన్న బహుమతులు ఇవ్వవచ్చు. అలా చేయడం వల్ల పిల్లలకు ఒక ప్రోత్సాహం వస్తుంది.

ప్రైవేట్ సమయం

పిల్లలు పాఠశాలలో , ఇంట్లో నిరంతరం చదువుకోవాలని తల్లిదండ్రులు భావించకూడదు. వారు తమ కోసం సమయం కేటాయించుకోవడానికి అనుమతించాలి. వారు చదువుకోవడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించినట్లే, టీవీ చూడటానికి , బయట ఆడుకోవడానికి కొంత సమయం ఇవ్వడం ముఖ్యం. ఈ విధంగా, వారు అలసిపోరు, ఉత్సాహంగా చదువుతారు. మీరు పిల్లలను చదువుపై మాత్రమే దృష్టి పెట్టమని బలవంతం చేస్తే, వారు త్వరగా నిరాశ చెందే అవకాశం ఉంది.

చదువుకునేటప్పుడు పిల్లలకు చాలా డౌట్స్ వచ్చే అవకాశం ఉంది. వారు మిమ్మల్ని ఆ డౌట్ అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పాలి. వారి సందేహాలను పరిష్కరించడానికి ప్రయత్నించాలి.

మీరు ఈ విషయాలను అనుసరించినప్పుడు, పిల్లలు ఖచ్చితంగా ఆసక్తితో చదవడం ప్రారంభిస్తారు. ఇది మొదట కష్టంగా అనిపించినప్పటికీ, పిల్లలు చివరికి దానికి అలవాటు పడతారు. చదివితే అది కొనిపెడతాం, ఇది కొనిపెడతాం అని ఆశపెట్టి.. తర్వాత ఇవ్వకుండా ఉండటం లాంటివి చేయకూడదు.

Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock