Vijay- Rashmika: విజయ్, రష్మికల పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది? వారి జాతకాలు ఏం చెబుతున్నాయో తెలుసా?

Educator

New member

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల నిశ్చితార్థం శుక్రవారం నాడు అత్యంత సన్నిహితుల మధ్య సీక్రెట్ గా జరిగిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత వీరి జీవితం ఎలా ఉండనుంది? వారి జాతకాలు ఏం చెబుతున్నాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమలో ఉన్నట్లు గతంలో చాలా వార్తలు వచ్చాయి. కొందరు జ్యోతిష్య నిపుణులు కూడా వారు త్వరలో పెళ్లి చేసుకుంటారని చెప్పారు. అయితే వారు ఏ రోజు ఆ వార్తలపై స్పందించలేదు. కానీ నిన్న (అక్టోబర్ 3 వ తేదీ- శుక్రవారం) సడెన్ గా వారి ఎంగేజ్ మెంట్ అత్యంత సన్నిహితుల మధ్య రహస్యంగా జరిగింది. మరి ఈ కొత్త జంట పెళ్లి తర్వాత ఎలాంటి లైఫ్ లీడ్ చేయబోతోంది. వారి జాతకాలు ఏం చెబుతున్నాయి. పండితుల సలహాలు, సూచనలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

విజయ్ దేవరకొండని అభిమానులు ముద్దుగా రౌడీ హిరో అని పిలుచుకుంటారు. విజయ్ 1989, మే 9న జన్మించారు. ఆయన పుట్టిన తేదీ ప్రకారం ఆయన రాశి వృషభం. జ్యోతిష్య పండితుల ప్రకారం.. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ జాతకంలో కొన్ని కీలకమైన సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి ఆయన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.

విజయ్ దేవరకొండ జాతకంలో శుక్రుడు నీచస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గ్రహ స్థితి కారణంగా ఆయనకు కెరీర్ లో సమస్యలు, వివాహ సమస్యలు కూడా ఉంటాయని అంచనా వేశారు. సినిమాల్లో రఫ్ అండ్ టఫ్‌గా కనిపించినప్పటికీ.. నిజ జీవితంలో విజయ్ దేవరకొండ చాలా ప్రాక్టికల్ గా ఉంటారట. ప్రతీది చాలా ప్లాన్ డ్ గా చేస్తారట. జాతకం ప్రకారం ఆయన తెలివి ఊహకందనిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న విషయానికి వస్తే ఆమె గతంలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వారు ఆ ఎంగేజ్ మెంట్ ని రద్దు చేసుకున్నారు. తర్వాత ఎవ్వరి లైఫ్ లో వారు బిజీ అయిపోయారు. అయితే వారిద్దరి జాతకాలు షష్టాష్టకాలుగా ఉన్నాయని.. ఆ బంధాన్ని విడిచిపెట్టమని సలహా ఇచ్చినట్లు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పేర్కొన్నారు.

రక్షిత్ శెట్టితో విడిపోయిన తర్వాత రష్మికకు అదృష్టం కలిసి వచ్చిందని.. ఊహించని స్థాయికి చేరుకుందని వేణుస్వామి చెప్పారు. ఆమెతో రాజశ్యామల, బగలాముఖి, తార వంటి పూజలు కూడా చేయించినట్లు వెల్లడించారు. ఈ పూజల ఫలితంగానే ఆమె నేషనల్ క్రష్ అయ్యారని పేర్కొన్నారు.

విజయ్, రష్మికల జాతకం ప్రకారం పెళ్లి తర్వాత విజయ్ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. అయితే దోష నివారణకు కొన్ని హోమాలు చేయాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. రష్మికకు మాత్రం పెళ్లి తర్వాత లైఫ్ సూపర్ గా ఉంటుందని చెబుతున్నారు. తన ద్వారా విజయ్ కి కూడా మేలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

గమనిక

ఈ సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ప్రముఖ జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనల ఆధారంగా అందించింది మాత్రమే.

Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock