Vijay-Rashmika:టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ల ఎంగేజ్‌మెంట్ తాజాగా జరిగింది. అత్యంత గోప్యంగా జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్ కి కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇంతకీ, విజయ్-రష్మిక లు ఇంత సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ జరుపుకోవడానికి కారణాలేంటీ..? వీరి పెళ్ళి ఎప్పుడు ఉండబోతుంది..ఎక్కడ విజయ్-రష్మిక ల పెళ్ళికి వేధికను ఫిక్స్ చేయనున్నారు..? ఇకపై రష్మిక సినిమాలకి దూరం కాబోతుందా..? విజయ్ ఇందుకు కండీషన్స్ పెట్టరా..? ఇలాంటి ఇంట్రస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగులో విజయ్ దేవరకొండకి రౌడీ హీరోగా మంచి ఇమేజ్ ఉంది. కెరీర్ ప్రారంభంలో యవడే సుబ్రమణ్యం, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి సినిమాలలో చిన్న పాత్రలను పోషించాడు. ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారాడు. గీత గోవిందం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఇక విజయ్ కి రౌడీ అనే ట్యాగ్‌లైన్ తెచ్చిన సినిమా మాత్రం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి. టాక్సీవాలా, డియర్ కామ్రేడ్, మహానటి, నోటా, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, కింగ్డం లాంటి సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఇమేజ్ ని తెచ్చుకున్నాడు.
విజయ్-రష్మిక కలిసి నటించిన సినిమాలు:
vijay-rashmika-engagement-completed
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మొదటిసారి గీత గోవిందం సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమాలో వీరి మధ్య ఉన్న లిప్ లాక్ చాలా హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత నుంచే వీరిద్దరు రిలేషన్స్ లో ఉన్నారని టాక్ మొదలైంది. డియర్ కామ్రేడ్ సినిమాలో మరోసారి జంటగా నటించారు. ఈ మూవీ ఫ్లాపైనప్పటికీ, వీరి మధ్య ఉన్న ముద్దు సన్నివేశం బాగా హైలెట్ అయింది. ఇక వీరిద్దరు కలిసి నటించింది రెండు సినిమాలే అయినా, టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ కపుల్స్ గా పాపులర్ అయ్యారు.
ఎప్పటికప్పుడు విజయ్-రష్మిక ‘ప్రేమ’లో ఉన్నారనే సంకేతాలు..
లైగర్ సినిమా షూటింగ్ ఎక్కువభాగం ముంబైలో జరిగింది. అలాగే, రష్మిక కూడా అనిమల్, ఛావా, సికందర్ సినిమాలతో బాలీవుడ్ లోనే ఉంది. ఖాళీ దొరికినప్పుడల్లా ముంబై వీధుల్లో కనిపించేవారు. దాంతో, వీరిద్దరు ప్రేమలో ఉన్నారని అటు ముంబై మీడియాలో ఇటు టాలీవుడ్ లో చెప్పుకున్నారు. ఇక, విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన సినిమాకి గెస్ట్ గా వచ్చిన రష్మికని కొందరు అభిమానులు ‘ఒదిన ఒదినా’.. అంటూ ఆటపట్టించారు. ఈ సమయంలో వీరి బంధం గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడుకున్నారు.
తాజాగా విజయ్-రష్మిక ల నిశ్చితార్థం..
ఈ శుక్రవారం(అక్టోబర్ 3) నాడు ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్య విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల కి ఎంగేజ్‌మెంట్ జరిగింది. చెప్పాలంటే ఇది మాత్రం ఎవరూ ఊహించలేదు. కారణం రష్మిక వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది. విజయ్ కూడా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నాడు. అంతేకాదు, ఇందులో విజయ్ కి జంటగా రష్మికనే నటిస్తుందని టాక్ వినిపిస్తోంది.
పెళ్ళెప్పుడు..ఇకపై సినిమాలకి రష్మిక గుడ్‌బై..?
విజయ్-రష్మికల పెళ్లి వచ్చే ఏడాది (2026) ఫిబ్రవరిలో ఉండబోతోంది. అప్పటి వరకూ రష్మిక కమిటైన సినిమాలు దాదాపు పూర్తవుతాయి. అయితే, పెళ్లి తర్వాత కూడా రష్మిక హీరోయిన్‌గా నటిస్తుందా..లేదా..? అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. చాలామంది హీరోయిన్స్ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని సినిమాలకి దూరం అయ్యారు. మరి, రష్మిక పెళ్లి తర్వాత తన కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకుందో చూడాలి. విజయ్ మాత్రం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని తెలుస్తోంది.
The post Vijay-Rashmika:సీక్రెట్ గా ఎంగేజ్‌మెంట్..అసలు కారణం అదేనా..? first appeared on Telugu News - Latest Telugu Updates - News and Entertainment.