Published on Oct 19, 2026 7:05 PM IST
విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’. వీరిద్దరి కాంబోపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ తాజాగా ఈ చిత్రం నుంచి మ్యూజికల్ అప్డేట్ను విడుదల చేశారు. ఈ సినిమాలోని ‘మాల’ అంటూ సాగే రెండవ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేయగా, ఇది మెలోడీ అండ్ క్యాచీ ట్యూన్ తో విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ పాటలో విక్టరీ వెంకటేష్, నివేథా పేతురాజ్ గ్లామరస్ లుక్‌లో మెరిసి అలరించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన రాగా, ఇప్పుడు విడుదలైన ఈ ‘మాల’ పాట సినిమాలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా నిలుస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పక్కా ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఈ కొత్త సాంగ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
