Published on Nov 23, 2026 10:03 PM IST
దుల్కర్ సల్మాన్ హీరోగా, పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆకాశంలో ఒక తార’ బాక్సాఫీస్ వద్ద స్లో గా పుంజుకుంటూ పాజిటివ్ రిజల్ట్స్ రాబడుతోంది. ఫస్ట్ డే సాధారణ ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా వీకెండ్లో ఈ సినిమా వసూళ్లు క్రమంగా పెరిగాయి.
ముఖ్యంగా ఆదివారం నాడు పలు కేంద్రాల్లో థియేటర్లకు ఫ్యామిలీ ఆడియన్స్ తాకిడి పెరగడం చిత్రబృందంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మొదటి మూడు రోజుల్లో క్రమంగా డెవలప్మెంట్ చూపెట్టిన ఈ సినిమాకు ఇప్పుడు మండే టెస్ట్ కీలకంగా మారింది. వీకెండ్ ఊపును వీక్డేస్లోనూ ఎంతవరకు కొనసాగిస్తుందనే దానిపైనే సినిమా లాంగ్ రన్ ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం మండే బుకింగ్ ట్రెండ్స్ ఆశాజనకంగా ఉండటంతో, రానున్న రోజుల్లోనూ ఇదే జోరును కొనసాగిస్తూ ‘ఆకాశంలో ఒక తార’ బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
