Published on Oct 23, 2026 9:21 PM IST
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను పూర్తి యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై అంచనాలు పెంచాయి. అయితే, తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఇదొక ఫ్యామిలీ అండ్ యాక్షన్ డ్రామాగా రాబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. తన కుటుంబం కోసం ఎంతటి విధ్వంసానికైనా సిద్ధపడే హీరోగా వెంకటేష్ మరోసారి తన యాక్షన్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్ సినిమాల్లో సహజంగా కనిపించే కామెడీ ఇందులోనూ ఉన్నప్పటికీ, ఈ ట్రైలర్ కట్లో ఎక్కువగా వయొలెన్స్ కనిపిస్తుంది. దీంతో ఇది త్రివిక్రమ్ మార్క్‌కు కాస్త భిన్నంగా సాగే చిత్రంగా రాబోతున్నట్లు అర్థమవుతుంది.
ఒక భయంకరమైన గ్యాంగ్ వరుస హత్యలు చేస్తూ చివరకు హీరో ఫ్యామిలీ వైపుకి వస్తుంది. దీంతో తమను రక్షించుకునేందుకు హీరో అండ్ ఫ్యామిలీ ఎలాంటి యాక్షన్ చేశారనేది మనకు ఈ సినిమా కథగా చూపెట్టబోతున్నారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, దేవయాని శర్మ, యువినా పార్థవి, నివేదా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అక్టోబర్ 30న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
