Published on Nov 16, 2026 9:03 PM IST
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో ‘కాకా’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఎప్పుడో పూర్తయిన ‘విశ్వంభర’ కూడా రిలీజ్‌కు రెడీగా ఉంది. కాగా, ఈ సినిమాల తర్వాత చిరు ఎవరితో సినిమా చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.
‘ది ప్యారడైజ్’ ఎఫెక్ట్‌తో శ్రీకాంత్ ఓదెల చిరుతో చేయాల్సిన నెక్స్ట్ ప్రాజెక్ట్ హోల్డ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌కు ఓ ప్రాజెక్ట్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ సర్కిల్స్ టాక్. ఇప్పటికే చిరు త్రివిక్రమ్ చెప్పిన కథను విని ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తోంది. అయితే, త్రివిక్రమ్ చిరుకు చెప్పింది గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు వినిపించిన కథే అని తెలుస్తోంది.
ఇది ఒక పూర్తి ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది. అయితే, చరణ్‌కు చెప్పిన కథకు కొన్ని మార్పులు చేర్పులు చేసి త్రివిక్రమ్ చిరుకు వినిపించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌తో ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా ప్రకటించిన త్రివిక్రమ్, అది ఆలస్యమవుతుందనే కారణంతో చిరుతో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడట.
