Published on Oct 24, 2026 8:52 PM IST
కింగ్ నాగార్జున సమర్పిస్తున్న యూత్‌ఫుల్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఇట్లు అర్జున’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అనీష్ హీరోగా అనశ్వర రాజన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను పలుమార్లు వాయిదా వేసి అక్టోబర్ 30న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
కానీ, ఇప్పుడు మరోసారి ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం, కొన్ని కారణాల వల్ల వాయిదా పడినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే సరికొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.
మహేష్ ఉప్పాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ చిత్రానికి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌ను ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.
