Published on Nov 6, 2026 9:53 PM IST
నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఆధ్యాత్మిక చిత్రం ‘హనుమాన్ అంశ్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకుంది. థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద రూ.440 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సెన్సేషనల్ హిట్‌ను నవంబర్ 27 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమా హిందీతో పాటు తెలుగులోనూ ఒకేసారి డిజిటల్ ప్రీమియర్ కానుంది. డాక్టర్ విశాల్ చతుర్వేది దర్శకత్వంలో అత్యంత తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ అద్భుతమైన దైవిక అనుభూతిని అందించింది. థియేటర్లలో రికార్డు వసూళ్లు రాబట్టిన ‘హనుమాన్ అంశ్’, ఇప్పుడు ఓటీటీ వేదికపై కూడా అదే స్థాయిలో వ్యూస్ సాధిస్తుందని డిజిటల్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
