Published on Nov 15, 2026 10:51 PM IST
తెలుగు సినిమా వద్ద ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. తనకి ఎప్పుడైతే పాన్ ఇండియా క్రేజ్ అండ్ రీచ్ వచ్చిందో అక్కడ సాలిడ్ సినిమాలు అందుకు తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే తనతో పాటుగా ఇతర స్టార్ హీరోలు కూడా పాన్ ఇండియా మార్కెట్ పైనే ఎక్కువ ఫోకస్ చేసే క్రమంలో తమ స్ట్రాంగ్ జోన్ ని పక్కన పెడుతున్నట్టుగా అందరిలో ఒక సమయం తర్వాత అనిపించింది.
కానీ దీన్ని బ్రేక్ చేస్తూ తారక్ లేటెస్ట్ గా దర్శకుడు అనీల్ రావిపూడితో ఓ సాలిడ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయడం చర్చకు దారి తీసింది. అయితే ఇది కేవలం రీజనల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ఓ ఎంటర్టైనర్ గా రాబోతుంది అని ఖరారు చేసేసారు. దీనితో తారక్ అవసరం ఉంటేనే పాన్ ఇండియా లేకపోతే మన తెలుగు ఆడియెన్స్ వరకు చాలు అనుకునే క్లారిటీ మీటర్ లో ఉండడం చాలా మంచి మూవ్.
అయితే ఇదే తరహాలో గతంలో ప్రభాస్ ట్రై చేసి ఊహించని ఫలితాన్ని అందుకున్నాడు. ఆ సినిమానే ‘ది రాజాసాబ్’. దర్శకుడు మారుతీతో ఈ సినిమాని కూడా ఒక ఫన్ హారర్ సినిమాగా చిన్న సినిమాలా అది కూడా త్వరగా ఫినిష్ చేసే ప్రాజెక్ట్ గా ప్లాన్ చేశారు. కానీ అది తర్వాత ఎటెటో వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. అలా ఆ ప్రాజెక్ట్ మిస్ ఫైర్ అయ్యింది. కానీ ఎన్టీఆర్, అనీల్ ప్రాజెక్ట్ ఈ టైప్ లో వెళ్లడం దాదాపు అసాధ్యం కావచ్చు. ఇద్దరూ మంచి క్లారిటీ తోనే ఈ సినిమాని అనౌన్స్ చేశారు. సో ఈ సినిమా ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.
