Published on Oct 20, 2026 10:04 PM IST
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాలూకా స్టార్డం ఏ రేంజ్ అనేది మరోసారి తన కొత్త సినిమా ‘జైలర్ 2’ చూపిస్తుంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సాలిడ్ ఎలివేషన్స్ యాక్షన్ డ్రామా విడుదల అయ్యిన రోజు నుంచే సంచలనం సెట్ చేస్తుంది. బుకింగ్స్ పరంగా ఎక్కడా డ్రాప్ లేకుండా ఇండియా వైడ్ దుమ్ము లేపుతున్న జైలర్ 2 ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సంచలనం సెట్ చేసింది.
ఇలా ప్రపంచ వ్యాప్తంగా జైలర్ 2 ఫెస్టివల్ సీజన్లో షాకింగ్ వసూళ్లు అందుకున్నట్టు ఇపుడు తెలుస్తుంది. రిలీజ్ అయ్యిన రోజు నుంచీ ప్రతీ రోజు 100 కోట్ల గ్రాస్ ని రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఆ ఫీట్ ని జైలర్ 2 సుసాధ్యం చేసినట్టు డిస్ట్రిక్ట్ సౌత్ వారు కితాబిస్తున్నారు.
అయితే ఇది ప్రతీ రోజు కాదు కానీ మొత్తం 5 రోజులకీ కలిపి సగటున జైలర్ 2 ఈ మార్క్ ని అందుకున్నట్టే అట. సో అలా వారు తలైవర్ స్టార్డంకి హైప్ ఇచ్చారు. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాల్సిందే. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే సన్ పిక్చర్స్ నిర్మాణం వహించారు.
Thalaivar walks in Slo-Mo, but the Box Office is running to meet the demand! 📈
₹100 Cr every day since release? That’s the SUPER effect we believe in! 🕶️
#Jailer2IndustryBlockbuster ❤️🔥
Find the Best Seats for #Jailer2 only on the District App! 💜
https://t.co/SXlMyOocqo https://t.co/8IoEh8u4sv— District Southside (@District_SS) October 20, 2026
