Published on Oct 18, 2026 7:59 PM IST
మన టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘కల్ట్’. తన దర్శకత్వంలోనే తెరకెక్కించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి ఆ మధ్య వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. ఇండియన్ సినిమా దగ్గర మొదటి R రేటెడ్ సినిమాగా ప్రెజెంట్ చేసిన ఈ సినిమా నుంచి ఫైనల్ గా మేకర్స్ ట్రైలర్ కట్ ని ఇప్పుడు విడుదల చేశారు.
అయితే ఈ ట్రైలర్ లోనే అసలు విషయాన్ని రివీల్ చేసారని చెప్పొచ్చు. టీజర్ లో కేవలం కొంతమేరకే ప్లాట్ రివీల్ అయితే ట్రైలర్ మాత్రం ఇందులో డెడ్లీ గేమ్, డ్రగ్స్, వంటి వాటికి విశ్వక్ కి లింక్ వంటివి రివీల్ చేశారు. ఇక పోలీస్ రోల్ లో విశ్వక్ సేన్ అదరగొట్టాడు. మాస్ అండ్ అగ్రెసివ్ పోలీస్ గా స్మార్ట్ లుక్స్ లో బాగున్నాడు. అదే విధంగా యాక్షన్ పార్ట్ ని కూడా గట్టిగానే డిజైన్ చేయించుకున్నాడు.
వైలెన్స్ అయితే ఇలాంటి సినిమాలని ఇష్టపడేవారికి గట్టి ట్రీట్ ఆనేలానే ఉంది. పైగా ఈ సీన్స్ ని మరింత నాచురల్ గా ప్రెజెంట్ చేయడం కూడా బాగుంది. సో మొత్తానికి ఓ సాలిడ్ స్లాషర్ సినిమాతో విశ్వక్ విధ్వంసం చూపించడానికి వస్తున్నాడు. సో ఈ సినిమా ఎలా ఉంటుందో ఈ అక్టోబర్ 30తో తెలిసిపోతుంది. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సందీప్ కాకర్ల నిర్మాణం వహించారు.
