Published on Oct 27, 2026 9:00 PM IST
‘జైలర్’ చిత్రంలో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీష్రాఫ్ వంటి స్టార్ హీరోల క్యామియోలు ఎంతటి సంచలన విజయం సాధించాయో తెలిసిందే. ‘జైలర్ 2’లోనూ కొనసాగిన ఈ కాస్టింగ్ సెంటిమెంట్‌ను సూపర్ స్టార్ రజినీకాంత్ తన నెక్స్ట్ చిత్రం ‘ధర్మన్’ కోసం కూడా రిపీట్ చేస్తున్నాడు.
అశ్విత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీకాంత్ డాక్టర్ పాత్రలో కనిపించనుండగా.. సిమ్రాన్, నయనతార, రాశీ ఖన్నా, శ్రీలీల ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒక ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఇటీవల షూటింగ్లో జాయిన్ అవ్వగా, వర్సటైల్ యాక్టర్ మిస్కిన్, యోగి బాబు కీలక పాత్రల్లో అలరించనున్నారు.
ఇలా ఇంతమంది స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాతో రజినీ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. మరి జైలర్ చిత్రానికి వర్కవుట్ అయిన ఈ భారీ క్యాస్టింగ్ సెంటిమెంట్ ధర్మన్‌కు కలిసొస్తుందో లేదో చూడాలి.
