Published on Nov 14, 2026 10:03 PM IST
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ నవంబర్ 20న బాక్సాఫీస్ వద్ద ఒక అరుదైన పోటీకి సిద్ధమవుతున్నారు. అదే రోజున మమ్ముట్టి నటించిన ధనుష్ చిత్రం ‘ఓం’, దుల్కర్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ థియేటర్లలోకి రానున్నాయి.
తండ్రీకొడుకుల చిత్రాలు ఒకే రోజు విడుదల కావడం సినీ అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇటీవల జరిగిన ‘ఆకాశంలో ఒక తార’ ప్రమోషనల్ ఈవెంట్లో దుల్కర్ స్పందిస్తూ, తన తండ్రి సినిమా ‘ఓం’ను ఒక పెద్ద తిమింగలంతో పోల్చాడు. ఈ రెండు చిత్రాలు వేర్వేరు భాషలు, భిన్నమైన జానర్లకు చెందినవని పేర్కొన్న ఆయన, ప్రేక్షకులు రెండు సినిమాలను చూసి వీకెండ్‌ను ఆస్వాదించాలని కోరాడు.
కాగా, ‘ఓం’ చిత్రంలో సాయి పల్లవి, శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తుండగా; ‘ఆకాశంలో ఒక తార’లో సాత్విక వీరవల్లి హీరోయిన్గా పరిచయమవుతుండగా శ్రుతి హాసన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.
