Published on Oct 28, 2026 9:00 PM IST
మెగాస్టార్ చిరంజీవితో టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఉన్న ఈ అరుదైన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా ఆకర్షిస్తోంది. టాలీవుడ్లో ఎన్నో సెన్సేషనల్ పాటలకు అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ అందించి తమదైన ముద్ర వేసిన ఈ ఇద్దరు టాప్ కొరియోగ్రాఫర్లు, మెగాస్టార్‌ను ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకుని నవ్వుతూ కనిపించిన ఈ దృశ్యం అభిమానులను తెగ అలరిస్తోంది.
ఇండియన్ సినిమా హిస్టరీలోనే డ్యాన్స్‌కు చిరునామాగా నిలిచే మెగాస్టార్‌తో ఇద్దరు మాస్టర్లు కలసి ఉన్న ఈ ఫోటో సినీ ప్రియులకు కన్నుల పండుగలా ఉంది. చిరంజీవి సినిమాల్లో చార్ట్‌బస్టర్ సాంగ్స్‌కి కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్.. ఆయనపై ఉన్న గౌరవాన్ని, బాండింగ్‌ను చాటుకునేలా దిగిన ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
