Published on Nov 1, 2026 9:00 PM IST
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్త ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ సినిమానే ‘రామాయణ’. రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కించిన ఈ గ్రాండ్ విజువల్ ట్రీట్ నే విట్నెస్ చేయలని చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఆల్రెడీ ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్ సేల్స్ ని స్టార్ట్ చేసుకుంది.
ఇక ఇంకా సినిమా రిలీజ్ నాలుగు రోజులే మిగిలి ఉండడంతో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్ సేల్స్ లో బాగానే రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియన్ మార్కెట్ సహా ఓవర్సీస్ మార్కెట్ లో కలిపి ప్రస్తుతానికి ఈ సినిమా రఫ్ గా 65 కోట్ల మేర గ్రాస్ ని అందుకున్నట్టు తెలుస్తుంది.
ఈ మొత్తంలో దాదాపు డే 1 వసూళ్లే ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఓవర్సీస్ మార్కెట్ లలో సినిమా ప్రీమియర్స్ పడ్డాయి. టాక్ కూడా బయటకి వచ్చింది. మరి డే 1 కి సినిమా ట్రెండ్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటించగా ఏ ఆర్ రెహమాన్ హన్స్ జిమ్మర్ లు సంగీతం అందించారు.
