Published on Oct 31, 2026 10:00 PM IST

బాలీవుడ్లో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మైథలాజికల్ చిత్రం ‘రామాయణ’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ముఖ్య పాత్రల్లో నితేష్ తివారి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.
ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో అత్యంత గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని నైజాం ప్రాంతంలో ఈ చిత్రానికి సంబంధించి టికెట్ బుకింగ్స్ తెరుచుకున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రిలీజ్ చేస్తుండటంతో తెలుగు నాట కూడా ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మరి ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి బుకింగ్స్ జరుగుతాయా.. ఈ సినిమా ఎలాంటి రికార్డులకు కేరాఫ్‌గా నిలుస్తుందా అనేది రాబోయే రోజుల్లో చూడాలి.