Published on Nov 12, 2026 9:00 PM IST
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన నెక్స్ట్ చిత్రం ‘రియాలిటీ’తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను ఆయనే స్వయంగా డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ సాంగ్ ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక తాజాగా రుత్తు అంటూ సెకండ్ సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు.
అయితే, ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ను కిరణ్ అబ్బవరం తాజాగా వెల్లడించాడు. ఈ సినిమాలో ప్రాచుర్యం పొందిన “రఘుకుల తిలకా రారా” అనే ప్రత్యేక గీతం ఉండబోతున్నట్లు కిరణ్ అబ్బవరం ప్రకటించాడు. ఈ పాట సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం భావిస్తోంది.
వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించే కిరణ్ అబ్బవరం, ‘రియాలిటీ’ సినిమాతో మరోసారి తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో దేవిక భట్ హీరోయిన్గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
