Published on Nov 12, 2026 10:00 PM IST
తనదైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సాయి పల్లవి, ‘రామాయణ’ చిత్రంలో సీత పాత్ర పోషించిన తర్వాత సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలను ఎదుర్కొంటుంది. ఆమె సెలక్షన్‌పై మొదట్లో భారీ ఆసక్తి నెలకొన్నప్పటికీ, సినిమా విడుదలయ్యాక సీతామాత పాత్రకు ఉండాల్సిన దైవత్వం ఆమె లుక్‌లో పూర్తిగా కనిపించలేదని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు.
దీంతో ఈ పాత్రకు ఆశించిన స్థాయిలో ప్రశంసలు దక్కకపోగా, ఆమె ఎంపికపై కొన్ని విమర్శలు సైతం వ్యక్తమయ్యాయి. ఇప్పుడు సాయి పల్లవి ఆశలన్నీ తన నెక్స్ట్ చిత్రం ‘ఓం’ పైనే ఉన్నాయి. ‘అమరన్’ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి రూపొందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ధనుష్, మమ్ముట్టిలతో కలిసి ఆమె నటిస్తుంది. ఇందులో ‘నిత్యా రెడ్డి’ అనే పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా ఆమె కనిపించనుండగా, ఇప్పటికే విడుదలైన ఆమె క్యారెక్టర్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.
ఈ చిత్రంతో సాయి పల్లవి మళ్లీ తన నటనతో ప్రేక్షకుల మెప్పు పొందితే విమర్శలకు చెక్ పెట్టవచ్చని, లేదంటే అది ఆమె భవిష్యత్ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
