Published on Oct 25, 2026 8:14 PM IST
ఇప్పుడు పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ సినిమానే ‘రామాయణ’. బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కించిన ఈ మహా కావ్యం కాస్టింగ్ పరంగా మొదట్లో పలు విమర్శలు అయితే లేకపోలేవు. ముఖ్యంగా సీత పాత్రలో సాయి పల్లవి సరైన ఎంపిక కాదు అని మొన్నటి వరకు కూడా కామెంట్స్, విమర్శలు ఉన్నాయి.
కానీ ఇప్పుడు ఆమె విషయంలో విమర్శలు నుంచి ప్రశంసలు వరకు పరిస్థితులు మారాయి. లేటెస్ట్ గా వచ్చిన రంగులే సాంగ్ లో ఆమె ప్రెజెన్స్ కి మంచి మార్కులు వీక్షకులు నుంచి దక్కుతున్నాయి. దీనితో సాయి పల్లవిపై ఎట్టకేలకు పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి అని చెప్పవచ్చు. ఇక ఫుల్ సినిమాలో ఆమె పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ నవంబర్ 5 వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాకి రెహమాన్, హన్స్ జిమ్మర్ లు సంగీతం అందించారు. అలాగే నమిత్ మల్హోత్రా, రాకింగ్ స్టార్ యష్ రావణ పాత్రలో నటించడమే కాకుండా తను కూడా సహా నిర్మాతగా వ్యవహరించారు.
