Published on Oct 25, 2026 9:05 PM IST
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో వరుసగా మూడు సినిమాలు ఒకే ఓటీటీకి ఆల్రెడీ అమ్మేసినట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా సెట్స్ మీద ఉన్న సినిమాలే రెండు అయితే ఒకటి ఇంకా మొదలు కూడా అవ్వనిదే అమ్మేసినట్టు తెలుస్తోంది.
ఇంతకీ ఆ సినిమాలు ఏమిటంటే సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేస్తున్న ధర్మన్ అలాగే టాలెంటెడ్ యువ హీరో శివ కార్తికేయన్ తో చేస్తున్న సీయన్, అలాగే కమల్ హాసన్ హీరోగా నటించనున్న ఓ సినిమాని మొత్తం మూడు కలిపి ఒకే ఓటీటీకి ఇచ్చేసారట. ఇక ఆ ఓటీటీ సంస్థ ఏంటంటే జియో హాట్ స్టార్ తో మూడు సినిమాలకి కలిపి ఒకే మొత్తంలో రికార్డ్ డీల్ తో ముగించేసినట్టు తెలుస్తోంది. సో మొత్తానికి కమల్ మాత్రం ఓ రేంజ్ ప్లాన్ తో దూసుకెళ్తున్నారు అని చెప్పవచ్చు.
