Published on Nov 19, 2026 9:03 PM IST
రామ్ పోతినేని హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘RAPO23’. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమా ప్రీ-లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నలుపు రంగు దుస్తుల్లో వెనుకకు తిరిగి నిలబడి, ఒక చేతిలో తుపాకీ, మరో చేతిలో టెడ్డీ బేర్ పట్టుకున్న రామ్‌ను “లోన్ వుల్ఫ్” గా పరిచయం చేశారు.
ఈ వైవిధ్యమైన పోస్టర్ సినిమా కథపై అంచనాలను పెంచగా, త్వరలోనే టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే, తాజాగా సీనియర్ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కూడా ఇందులో రామ్‌కు ప్రతినాయకుడిగా నటిస్తున్నాడని, ఆయనపై కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌కు రామ్ స్వయంగా కథ, దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
