రియాలిటీ షో : ది ట్రైటర్స్ తెలుగు
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : అక్టోబర్ 23, 2026
స్ట్రీమింగ్ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు : చిన్మయి శ్రీపాద, ఆషిక పదుకొనె, హర్ష వర్ధన్, ప్రగతి మహవాడి, రాహత్ ఆచంట, నిఖిల్ విజయేంద్ర సింహా, విద్యుల్లేఖ రామన్, విష్ణు ఒయ్, శ్రావ్య వర్మ, వర్ష డిసౌజా తదితరులు
దర్శకత్వం : మేఘన బడోల
నిర్మాతలు : కామ్న మెనిజెస్, ఫజిలా అల్లానా
ఛాయాగ్రహణం : దివాకరణ్ ఆర్
కూర్పు : జాజిమొగ్గ రమేష్ తదితరులు
సంబంధిత లింక్స్ : ట్రైలర్
చిన్మయి శ్రీపాద, నిఖిల్ విజయేంద్ర సింహ, గౌరవ్ సునీల్, విద్యుల్లేఖ రామన్ ఎలిమినేషన్ల తర్వాత ‘ది ట్రైటర్స్ తెలుగు’ షో కొత్తగా మూడు ఎపిసోడ్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హోస్ట్ తేజ సజ్జా నడిపిస్తున్న ఈ షోలో ఈసారి మెరుగైన మిషన్లు, సీరియస్ వాదనలు, ఆసక్తికరమైన మైండ్ గేమ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కంటెస్టెంట్లు తమను తాము కాపాడుకుంటూనే, ‘ట్రైటర్స్’ ఎవరు అని కనిపెట్టడానికి పడే తపన షోను మరింత ఎంగేజింగ్‌గా మార్చింది.
విష్ణు ఎంట్రీ – హౌస్‌లో మారిన సమీకరణాలు:
నాలుగో ఎపిసోడ్ ఆరంభంలో ధనంజయ్ తిరిగి హౌస్‌లోకి అడుగుపెట్టాడు. అతను ‘ట్రేటర్’ అవుతాడని అందరూ భావించినప్పటికీ, తేజ సజ్జా మరియు ఇప్పటికే ఉన్న ట్రేటర్స్ (ఆషికా పడుకోణె, రాహత్ అచంట) కలిసి విష్ణు ఓయ్ని కొత్త ట్రేటర్‌గా ఎంచుకున్నారు. అయితే, విష్ణు తన ప్రవర్తనలోని సడెన్ చేంజెస్ వల్ల వెంటనే అనుమానాస్పదంగా మారి, ఒక్క రోజులోనే ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ‘ఇన్నోసెంట్స్’ ఖాతాలో మరో విజయం చేరింది. దీనికి ప్రతీకారంగా ట్రేటర్స్ సాయి రోనక్ను ఎలిమినేట్ (మర్డర్) చేశారు.
రాహత్ వ్యూహం – శ్రావ్య చాకచక్యం:
మరోవైపు, రాహత్ చాలా జాగ్రత్తగా గేమ్ ఆడుతూ వర్ష డిసౌజా, ప్రణవ్ చాగంటిల నమ్మకాన్ని గెలుచుకున్నాడు. కానీ, శ్రావ్య వర్మ అతడి చర్యలను అనుమానించడం మొదలుపెట్టింది. ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేసి రాహత్ ముసుగును తొలగించడంలో శ్రావ్య కీలక పాత్ర పోషించింది. రాహత్ ఎలిమినేషన్‌తో ఇన్నోసెంట్స్కి పెద్ద విజయం దక్కింది.
ఆకట్టుకున్న టాస్క్‌లు:
ఈ ఎపిసోడ్లలో టాస్క్‌లు ఎంతో ఉత్కంఠగా సాగాయి. మొదటి మిషన్‌లో శవాన్ని మోస్తూ గడియారాలు, చందనం సేకరించడంలో పోటీదారులు విఫలమై ప్రైజ్ మనీ గెలవలేకపోయారు. రూ.28 లక్షల విలువైన రెండో మిషన్‌లో కంటెస్టెంట్లు తమ సొంత లాభం కోసమే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప, ఉమ్మడి ప్రైజ్ మనీకి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. స్నేహితుల్లా నటించినా, అంతిమంగా ప్రతి ఒక్కరూ తమ స్వార్థం కోసమే ఆడుతున్నారని ఈ మిషన్ నిరూపించింది.
మూడో మిషన్‌లో అర్ధరాత్రి ఎలిమినేషన్‌కు గురయ్యే ప్రమాదంలో ఉన్నవారిని కాపాడే క్రమంలో రాహత్.. మౌనీషా చౌదరిని కాపాడాడు. ఐతే, విరుద్ధంగా మౌనీషా తర్వాతి కాలంలో రాహత్నే అనుమానించడం విశేషం.
మెరిసిన శ్రావ్య వర్మ.. ప్రెషర్లో రాహత్ :
ఇన్నోసెంట్స్ విభాగంలో శ్రావ్య అత్యంత బలమైన ప్లేయర్‌గా నిలిచింది. విద్యుల్లేఖను కనిపెట్టడంలో సహాయపడటంతో పాటు, రాహత్ అసలు రంగును బయటపెట్టడంలో శ్రావ్య చాకచక్యం వంద శాతం వర్కవుట్ అయింది.
వ్యక్తిగత బంధాలు, నమ్మకం ఎంతటి బలహీనతగా మారుతాయనేది రాహత్ ఎలిమినేషన్ స్పష్టం చేసింది. హౌస్‌లో తాను ఎంతో నమ్మిన వ్యక్తి, తనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గేమ్ వ్యూహంలో భాగంగా వాడుకున్నాడని తెలుసుకున్న వర్ష డిసౌజా తీవ్ర నిరాశకు గురైంది. నమ్మకం పెట్టుకున్న మనుషులే వ్యూహాత్మకంగా వాడుకోవడం ఈ రియాలిటీ గేమ్‌లో కంటెస్టెంట్లకు ఎంత పెద్ద ఎదురుదెబ్బో ఈ సంఘటన తెలియజేసింది.
ప్రస్తుతం హౌస్‌లో మిగిలిన ఏకైక ‘ట్రేటర్’ ఆషికానే. ఇప్పటివరకు ప్రశాంతంగా ఉంటూ ఎవరికీ అనుమానం రాకుండా ఆడిన ఆమెకు, ఇప్పుడు ఒంటరిగా గేమ్‌ను నడిపించడం అతిపెద్ద సవాలుగా మారనుంది. ప్రగతి మహావది, స్వీకర్ అగస్తిలు మంచి పాయింట్లు లేవనెత్తుతున్నారు. హర్షవర్ధన్ మాత్రం అసలైన ట్రేటర్స్‌ను వదిలేసి ఇతరులను అనుమానిస్తూ తడబడుతున్నారు. ఇక ధనంజయ్ సైలెంట్‌గా ఉండటం అతనికి మైసస్ అయ్యే అవకాశం ఉంది.
తేజ సజ్జా :
తేజ సజ్జా తన హోస్టింగ్‌తో ఆకట్టుకున్నప్పటికీ, మొదటి మూడు ఎపిసోడ్లతో పోలిస్తే ఈ ఎపిసోడ్లలో అతని స్క్రీన్ ప్రెజెన్స్ కాస్త తగ్గింది. హౌస్మేట్స్ మధ్య పెరిగిన ఘర్షణలు, రౌండ్ ఆఫ్ డౌట్ చర్చలకే ఎక్కువ ప్రాధాన్యత లభించింది.
తీర్పు :
మొత్తంగా చూస్తే, ‘ది ట్రేటర్స్ తెలుగు’ ఎపిసోడ్లు 4 నుంచి 6 వరకు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాయి. మెరుగైన టాస్క్‌లు, కంటెస్టెంట్ల మధ్య పెరిగిన పోటీ వాతావరణం షో స్థాయిని పెంచాయి. నిడివి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, మైండ్ గేమ్స్ మరియు సస్పెన్స్‌ను ఆస్వాదించే రియాలిటీ షో ప్రేమికులకు ఈ ఎపిసోడ్లు మంచి ఎంటర్టైన్మెంట్ను అందిస్తాయి.
123telugu.com Rating: 3.25/5
Reviewed by 123telugu Team
