Welcome To DailyEducation

DailyEducation is an open-source platform for educational updates and sharing knowledge with the World of Everyday students.

How To Improve Your Cibil Score Telugu 2024

hanuman

Active member

మీ సిబిల్ స్కోర్ చాలా సులభంగా పెంచే సిక్రెట్ టిప్స్


ఫ్రెండ్స్ మన అందరికి సిబిల్ స్కోర్ గురించి తెలిసే ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలి అంటే మనం లోన్స్ తీసుకోవాలి అన్నా, క్రెడిట్ కార్డ్స్ పొందాలి అన్న మన సిబిల్ స్కోర్ బాగా ఉండాలి. సిబిల్ స్కోర్ లేకపోతే మనకు కనీసం పర్సనల్ లోన్ కూడా ఇవ్వరు. ఈ ఆర్టికల్ లో మనం అసలు ఈ “సిబిల్ స్కోర్” అంటే ఏమిటి? ఈ స్కోర్ ని మనం పెంచుకోవడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా? అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం.

CIBIL SCORE అంటే ఏమిటి?


ఫ్రెండ్స్ CIBIL అనే పదానికి “క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ ” అని అర్థం. ఇది ఆర్బీఐ గుర్తింపు పొందిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. సిబిల్ స్కోర్ అంటే మన యొక్క క్రెడిట్ రిపోర్ట్ అని చెప్పుకోవచ్చు. మనం ఇంతకు ముందు ఏవైనా లోన్స్ తిసుకున్నామా? తీసుకొని ఉంటె వాటిని టైం కి కట్టమా లేదా అనే విషయాలను ఆధారంగా చేసుకొని ఈ ఏజెన్సీ సిబిల్ స్కోర్ ని రెడీ చేస్తుంది.

సాధారణగా ఈ సిబిల్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. మన సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటె క్రెడిట్ కార్డు కానీ లోన్స్ కానీ ఏవైనా సరే అప్లై చేసిన వెంటనే అప్రూ అవుతాయి. అదే మన సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటె ఏవి రావు. కాబట్టి మన సిబిల్ స్కోర్ అనేది ఎప్పుడు 750 పైన ఉండాలి.

750 కంటే మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నదా? ఈ స్కోర్ ని మీరు పెంచుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన టిప్స్ పాటించండి వెంటనే మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది.

సిబిల్ స్కోర్ ని పెంచే టిప్స్


ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సిబిల్ స్కోర్ పెండుకోవడానికి ఉన్నటువంటి టిప్స్ గురించి తెలుసుకుందాం.

1.రుణాలను తిరిగి చెల్లించడం:


సిబిల్ స్కోర్ ని పెంచుకోవడానికి ఉన్నటువంటి టిప్స్ లో మొదటిది రుణాలను తిరిగి చెల్లించడం. ఇది చాలా ముఖ్యమైనది. మీరు ఏవైనా లోన్స్ తీసుకొని వాటిని తిరిగి చెల్లించకుండా ఉంటె వెంటనే వాటిని చెల్లించండి. ఒకవేల మీరు మూడు నెలలకు మించి రుణం చెల్లించకపోతే బ్యాంకులు ఆ అప్పును NPA గా మారుస్తాయి. కాబట్టి వెంటనే తిరిగి చెల్లించాలి. ఇలా చేయండం వలన సిబిల్ స్కోర్ వెంటనే పెరుగుతుంది.

2.ఎక్కువ రుణాలు తీసుకోవద్దు :


ఫ్రెండ్స్ ఒక్కోసారి మనం ఎక్కువ లోన్స్ తీసుకుంటే రుణదాత అంటే మనకు లోన్స్ ఇచ్చే వాళ్ళు మనం ఎక్కువగా లోన్స్ పై ఆధారపడతాము అని, మన ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేదని భావిస్తారు. ఎక్కువ లోన్స్ తీసుకోవటంవలన మన సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటుంది. ఎక్కువగా చిన్న చిన్న లోన్స్ తీసుకునే బదులు, మనం ఒక పెద్ద లోన్ తీసుకొని EMI ని టైం టి కట్టుకోవచ్చు.దీనివల్ల మన సిబిల్ స్కోర్ చాలా సులభంగా పెరుగుతుంది. ఎలా అంటే మనం టైం కి EMI కట్టడం వలన క్రెడిట్ బ్యురోస్ కి మనం టైం కి డబ్బు కడతాము అనే నమ్మకం వస్తుంది. తద్వారా మన సిబిల్ స్కోర్ పెరుగుతుంది.

3.ఒకేసారి ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ కి అప్లై చేయవద్దు:


మనం ఒకేసారి ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ కి అప్లై చేయటం వలన మన క్రెడిట్ రిపోర్ట్ పై ఎంక్వారి పడుతుంది. దీనివలన కూడా మన సిబిల్ స్కోర్ తగ్గుతుంది. కాబట్టి మనం ఒకేసారి ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ అప్లై చేయకూడదు. అప్లై చేయాలి అంటే 3 నేలలు లేదా 6 నెలలు గ్యాప్ ఇచ్చి క్రెడిట్ కార్డ్స్ కి అప్లై చేసుకోవాలి.

4.క్రెడిట్ రిపోర్ట్‌లో లోపాలు:​


ఫ్రెండ్స్ ఒక్కోసారి మనం ఏమి పొరపాటు చేయకున్నా మన సిబిల్ స్కోర్ తగ్గుతుంటుంది. ఇలాంటప్పుడు మన క్రెడిట్ రిపోర్ట్ ని ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోవాలి. మనకు సంబంధం లేని లోన్ ఏవైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇలాంటివి ఏవైనా ఉంటె వెంటనే బ్యాంక్స్, క్రెడిట్ బ్యూరోలకు కంప్లైంట్ చేయాలి.

5. క్రెడిట్ కార్డు లిమిట్ ని సరిగా వాడటం:


మనం ఎప్పుడు క్రెడిట్ కార్డ్స్ లిమిట్ చాలా జాగ్రత్తగా వాడాలి. మనం ఎప్పుడు కూడా క్రెడిట్ కార్డు కి ఉన్నటువంటి లిమిట్ లో కేవలం 30% మాత్రమే వాడుకోవాలి. అంతకు మించి ఎక్కువగా వాడుకుంటే క్రెడిట్ స్కోర్ పై దేబ్బపడుతుంది.

6. మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ ని తీసుకోవడం మానేయండి. ఎందుకంటే కార్లోడ్స్ ఉన్న లిమిట్ ని వాడుకుని అప్పులో పడే అవకాశం ఉంటుంది. దీనివలన అంతిమంగా క్రెడిట్ స్కోర్ పై ఎఫెక్ట్ పడుతుంది.

గమనిక:- పైన తెలిపిన సమాచారం మొత్తం ఇంటర్ నెట్ దొరికిన సమాచారంను ఆధారంగా చేసుకొని తెలిపాము. మీకు ఎవైనా డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి.
 
Back
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock