Welcome To DailyEducation

DailyEducation is an open-source platform for educational updates and sharing knowledge with the World of Everyday students.

How To Open Zerodha Account In Telugu

hanuman

Active member

Zerodha అకౌంట్ అంటే ఏమిటి? ఈ అకౌంట్ ని ఎలా ఓపెన్ చేసుకోవాలి?


Zerodha Account In Telugu: ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ లో మనం జీరోధా అకౌంట్ అంటే ఏంటి? ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అంటే అర్హత ఏమి ఉండాలి, డాకుమెంట్స్ ఏమి కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనే వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఫ్రెండ్స్ ఈ జీరోధా అకౌంట్ అనేది ఒక డిమ్యాట్ అకౌంట్. సింపుల్ గా చెప్పాలి అంటే భారతదేశంలోని స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు BSE, NSE & MCXలో ఈక్విటీ, డెరివేటివ్‌లు, కమోడిటీ మరియు కరెన్సీ విభాగాలలో ట్రేడింగ్ సేవలను అందించే డిస్కౌంట్ స్టాక్ బ్రోకర్. Zerodha 2010లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. క్రింద ఈ అకౌంట్ గురించి ఇంకొంచం వివరంగా తెలుసుకుందాం.

Zerodha account in telugu


Zerodha Account Eligibility In Telugu


ఫ్రెండ్స్ జెరోధా అకౌంట్ ని మనం ఓపెన్ చేసుకోవాలి అంటే మనకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరులై ఉండాలి.
  2. వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి.
  3. నెలకు కనీసం 15,000 రూ.. కంటే ఎక్కువ ఆదాయం ఉండాలి.

Zerodha Account Required Documents In Telugu


మనం ఈ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవాలి అంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.

  1. ఆధార్ కార్డ్.
  2. పాన్ కార్డ్.
  3. ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్.
  4. సంతకం ని స్కాన్ చేసిన కాపీ.
  5. మీ ఆదాయం 1 లక్ష కంటే ఎక్కువ ఉంటె ITR.
  6. మీరు స్యాలరి పర్సన్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్.
  7. ఫారం 16

Zerodha Account Features In Telugu


ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ zerodha అకౌంట్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

  1. భారత దేశంలోనే అతి పెద్ద స్టాక్ బ్రోకర్.
  2. ఈ అకౌంట్ లో ఫీజులు కూడా చాలా తక్కువ.
  3. ఇది 100% సురక్షితమైన అకౌంట్.
  4. ఇది క్లయింట్ డబ్బుతో యాజమాన్య వ్యాపారం చేయదు.
  5. 2-ఇన్-1 అకౌంట్ లాగా పని చేస్తుంది.దీనివల్ల ట్రేడింగ్ మరియు డీమ్యాట్ ఖాతాల మధ్య ఒకేరకమైన లావాదేవీలను అందిస్తుంది.
  6. స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్ కోసం తక్కువ ఛార్జీలు వసూలు చేస్తుంది.

How To Open Zerodha Account In Telugu


ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఈ zerodha అకౌంట్ యొక్క ఫీచర్స్, డాకుమెంట్స్, అర్హతల గురించి తెలుకున్నాం. ఇప్పుడు ఈ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో తెలుసుకుందాం.

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా జీరోధా మెయిన్ వెబ్సైట్ కి వెళ్ళండి.
  2. మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి continue పై క్లిక్ చేయండి.
    zerodha account in telugu
  3. మీ మొబైల్ కి ఒక otp వస్తుంది దాన్ని ఎంటర్ చేసి continue పై క్లిక్ చేయండి.
  4. మీ పేరు, ఇ మెయిల్ ఐడి ని చేసి continue పై క్లిక్ చేయండి.
  5. మీ మెయిల్ కి ఒక otp వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి continue పై క్లిక్ చేయండి.
  6. మీ పాన్ కార్డు నెంబర్, డేట్ అఫ్ బర్త్ ని ఎంటర్ చేసి continue పై క్లిక్ చేయండి.
  7. తర్వాత పేమెంట్ మెథడ్ ని సెలెక్ట్ చేసుకొని pay&continue పై క్లిక్ చేయండి.
  8. ఆధార్ kyc కోసం continue to Digilocker పై క్లిక్ చేయండి.
  9. మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి next పై క్లిక్ చేయండి.
  10. మీ మొబైల్ కి otp వస్తుంది దాన్ని ఎంటర్ చేసి continue పై క్లిక్ చేయండి.
  11. తర్వాత allow పై క్లిక్ చేయండి.
  12. your profile ఓపెన్ అవుతుంది. ఇందులో మీ మ్యారిటల్ స్టేటస్, మీ తల్లితండ్రుల పేర్లు,మీ య్యనువల్ ఇన్కం ని ఎంటర్ చేసి continue పై క్లిక్ చేయండి.
  13. link bank account పేజి ఓపెన్ అవుతుంది. ఇందులో మీ బ్యాంకు అకౌంట్ బ్రాంచ్ యొక్క ifsc code, బ్రాంచ్ micr code, అకౌంట్ నెంబర్,ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిసన్స్ ని సెలక్ట్ చేసుకొని continue పై క్లిక్ చేయండి.
  14. కోన్ని పర్మిషన్స్ అడుగుతుంది. వాటిని allow చేసేయండి.
  15. వాళ్ళు ఒక నెంబర్ ని ఇస్తారు. దానిని ఒక పేపర్ లో రాసుకొని సెల్ఫి తీసుకొని capture పై క్లిక్ చేయండి.
  16. తర్వాత మీ డాకుమెంట్స్ ని అప్లోడ్ చేయండి. డాకుమెంట్స్ అంటే పాన్ కార్డు, మీ సంతకం వంటివి.
  17. నామిని ని కావాలంటే add చేసుకోవచ్చు. లేదంటే skip&continue పై క్లిక్ చేయండి.
  18. esign ని చేసుకోండి. అంటే మీరు esign పై క్లిక్ చేయగానే కొన్ని ఆప్షన్స్ వస్తాయి క్రింద proceed to esign అని ఉంటుంది.దాని పై క్లిక్ చేయండి.
  19. తర్వాత మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి send otp పై క్లిక్ చేయండి.
  20. మీ మొబైల్ కి ఒక otp వస్తుంది.దాన్ని ఎంటర్ చేసి verify otp పై క్లిక్ చేయండి.
  21. మీ ప్రొఫైల్ వెరిఫై అవుతుంది.క్రింద sign now పై క్లిక్ చేయండి.
  22. మల్లి మీరు మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి send otp పై క్లిక్ చేయండి.
  23. మీ మొబైల్ కి ఒక otp వస్తుంది.దాన్ని ఎంటర్ చేసి verify otp పై క్లిక్ చేయండి.
  24. మీ esign successfully అవుతుంది.
  25. తర్వాత esigned document పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి లేదా ఆ ఆప్షన్ క్రింద finish పై క్లిక్ చేయండి.
  26. 24 గంటల తర్వాత మన మెయిల్ కి యూసర్ id సెండ్ చేస్తారు. దాని ద్వారా మనం లాగిన్ అవ్వవచ్చు .

పైన తెలిపిన విధంగా మీరు ఆన్లైన్ లో zerodha అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు.

 
Back
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock